![Sultana Takes Over As Captain Of South Zone For Under 23 Womens Odi Tourney - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/5/sultana.jpg.webp?itok=KtsJoOVK)
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ అండర్–23 మహిళల వన్డే టోర్నమెంట్‌లో సత్తాచాటిన ముగ్గురు హైదరాబాద్ ప్లేయర్లు సౌత్ జోన్‌కు ఎంపికయ్యారు. కేరళలో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన గౌహర్ సుల్తానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆమెతో పాటు స్రవంతి నాయుడు, అనన్య ఉపేంద్రన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదే జట్టులో స్టాండ్ బైగా హిమని యాదవ్, కావ్య కూడా ఉన్నారు. మరోవైపు బరోడాలో ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగనున్న ఇంటర్ జోనల్ మ్యాచ్‌లకు డి. రమ్య, రచన ఎస్ కుమార్ ఎంపికయ్యారు. ఇదే జట్టులో స్టాండ్‌బైగా లక్ష్మీ ప్రసన్న కొనసాగుతుంది.
మహిళల అండర్–23 క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపికైన వారి జాబితాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ బృందంలో రచన, శ్రావణి, ప్రణతి రెడ్డి, రమ్య, స్నేహ మోరే త్రిష, ప్రసన్న, అనురాధ నాయక్ (వికెట్ కీపర్), చరిష్మ, శ్రావ్య (వికెట్ కీపర్), కె. అనిత, వర్ష, శ్రావీణ, భవ్య, మమత (వికెట్ కీపర్), భావన, ప్రణతి, వినయ శ్రీ, చిత్రా మహేశ్వరి, క్రాంతిలకు చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment