హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు సన్ రైజర్స్ వరుస వికెట్లను కోల్పోతున్నా ధవన్ మాత్రం అత్యంత నిలకడను ప్రదర్శించాడు. ధవన్(56 నాటౌట్; 53 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్))తో బాధ్యతాయుతంగా ఆడాడు. మిగతా సన్ రైజర్స్ ఆటగాళ్లు విఫలం కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగల్గింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే డేవిడ్ వార్నర్(0) వికెట్ ను కోల్పోయింది. అనంతరం ఆదిత్య తారే(8), ఇయాన్ మోర్గాన్(0), హూడా(1), హెన్రీక్యూస్(1)లను నష్టపోయి కష్టాల్లో పడింది. మరోవైపు 32 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఈ ఐపీఎల్లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. హైదరాబాద్ మిగతా ఆటగాళ్లలో ఆదిత్యా తారే(8), ఇయాన్ మోర్గాన్(0),దీపక్ హూడా(0),హెన్రీక్యూస్(1)లు ఘోరంగా విఫలమయ్యారు. ధవన్ కు తోడు నమాన్ ఓజా(18),భువనేశ్వర్ కుమార్(21) మోస్తరుగా రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. పుణె బౌలర్లలో అశోక్ దిండా మూడు వికెట్లు సాధించగా,మిచెల్ మార్ష్ కు రెండు వికెట్లు, రవి చంద్రన్ అశ్విన్, పెరీరాలకు కు ఒక వికెట్ దక్కింది.
ఆకట్టుకున్న దిండా
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పుణె బౌలర్ అశోక్ దిండా ఆరంభపు మ్యాచ్లోనే అదరగొట్టాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ కు ప్రధాన బలమైన డేవిడ్ వార్నర్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి పుణె పెట్టుకున్న ఆశలను నిజం చేశాడు. తొలి ఓవర్ ను అందుకున్న దిండా..నాల్గో బంతికే వార్నర్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. ఆ తరువాత ఆదిత్యా తారేను, నమాన్ ఓజాను అవుట్ చేశాడు. నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేసిన దిండా తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి 10 పరుగులకే మాత్రమే ఇవ్వగా, అతని వ్యక్తిగత నాల్గో ఓవర్ లో 13 పరుగులిచ్చాడు. ఓవరాల్ గా ఒక మేడిన్ సాయంతో సన్ రైజర్స్ ను కట్టడి చేయడంలో దిండా ప్రధాన పాత్ర పోషించాడు.
శిఖర ధవన్ ఒక్కడే..
Published Tue, Apr 26 2016 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement