
సరైన నిర్ణయం: గవాస్కర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియామకాన్ని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించారు. టెస్టుల్లో ధోని సేన వైఫల్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనని అన్నారు. టీమ్ డెరైక్టర్ పదవికి శాస్త్రి అర్హుడేనని ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు టెస్టు సిరీస్ ఓటమిపై తీవ్ర విమర్శలెదుర్కొంటున్న కెప్టెన్ ధోనికి గవాస్కర్ అండగా నిలిచారు. భారత జట్టు కెప్టెన్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు.