ముంబై: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో పరాభవం తప్పదని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబై ఇండియన్స్‌పై 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కాపాడుకుని సంచలన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. రషీద్ ఏకంగా 16 డాట్ బాల్స్ వేయడం గమనార్హం. సిద్ధార్థ్ కౌల్ 3 వికెట్లు తీయగా, థంపి రెండు వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ అనంతరం రషీద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా బౌలింగ్ యాక్షనే నా బలం. ఇతర లెగ్ స్పిన్నర్లతో పోల్చితే నా బౌలింగ్ కాస్త వేగంగా ఉంటుంది. దాంతో పాటుగా బౌలింగ్ వేసేటప్పుడు చేతి కదలిక భిన్నంగా ఉండటంతో బ్యాట్స్‌మెన్లు బంతిని అంచనా వేయడానికి సమయం తీసుకుంటారు. అదే నాకు ప్లస్ పాయింట్. అంతలోనే ప్రత్యర్థి జట్టుకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. మా కెప్టెన్ విలియమ్సన్ పోరాటం చేసే కెప్టెన్. 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం విలియమ్సన్ నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. గత రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో చేసిన తప్పుల నుంచి ఎంతో నేర్చుకున్నానని’ బౌలర్ రషీద్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment