హైదరాబాద్: ఐపీఎల్-8 లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసి అలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ని ముంబై బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 7 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(6), ధావన్(1) వికెట్లని కోల్పోయింది. 23 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో మోర్గాన్(9) వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా హెన్రిక్స్(11), ఓజా(0) లు వెనువెంటనే ఔటయ్యారు. నిలకడగా ఆడుతూ హైదరాబాద్ స్కోరుని పెంచే ప్రయత్నంలోనే రాహుల్(24) హర్భజన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశిష్ రెడ్డి(17), భవనేశ్వర్ కుమార్(0), కరణ్(15), ప్రవీణ్ కుమార్(4) పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో స్టెయిన్(17) ధాటిగా ఆడి పరుగులు రాబట్టి నాటౌట్గా నిలిచాడు. ముంబై బౌలింగ్లో మెక్ క్లెనఘన్ మూడు వికెట్లు తీసి రాణించగా, సుచిత్, మలింగాలు తలా రెండు వికెట్లు తీశారు. హర్భజన్, పోలార్డ్ లకి చెరో వికెట్ లభించింది.