న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జనవరి నెలాఖరు వరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ బీసీసీఐకి సూచించింది. డిసెంబర్ 17న జరగాల్సిన బీసీసీఐ సర్వ సభ్య సమావేశాన్ని కూడా వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.