
టి20 ప్రపంచకప్ విశ్లేషకుడిగా వీరేంద్ర సెహ్వాగ్
స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్ సందర్భంగా భారత మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘క్రిక్‌బజ్’ వెబ్‌సైట్‌కు విశ్లేషకుడిగా ....
స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్ సందర్భంగా భారత మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘క్రిక్‌బజ్’ వెబ్‌సైట్‌కు విశ్లేషకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో పలు టీవీచానెల్స్‌లో క్రికెట్ కార్యక్రమాల్లో విశ్లేషకుడిగా పనిచేసిన సెహ్వాగ్ ఓ వెబ్‌సైట్‌తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. టోర్నీ సందర్భంగా సెహ్వాగ్ వెబ్‌సైట్ వీక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు.