నగరానికి చెందిన టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సికింద్రాబాద్ రోటరి క్లబ్ సన్మానించింది. స్థానిక ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ప్రముఖ ఫిట్‌నెస్ శిక్షకురాలు దినాజ్‌ను కూడా క్లబ్ వర్గాలు సత్కరించాయి.
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సికింద్రాబాద్ రోటరి క్లబ్ సన్మానించింది. స్థానిక ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ప్రముఖ ఫిట్‌నెస్ శిక్షకురాలు దినాజ్‌ను కూడా క్లబ్ వర్గాలు సత్కరించాయి. నైనా ఆటతో పాటు చదవు సంధ్యల్లోనూ బహుముఖ ప్రజ్ఞాశాలీగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పిన్న వయస్సులోనే ఎస్.ఎస్.సి., ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆమె ఇప్పుడు 14 ఏళ్ల వయస్సులో గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నైనా మాట్లాడుతూ ‘ఎంచుకున్న క్రీడతో పాటు చదువు, సంగీతం, వంట నాకిష్టమైన వ్యాపకాలు. ఇవన్నీ నా జీవితాన్ని సంతోషంతో నింపాయి’ అని తెలిపింది. క్లబ్ అధ్యక్షుడు కెర్సీ పటేల్ ఆమెకు మెమెంటోను అందజేయగా, కార్యదర్శి సుధీర్ సుఖ్‌దేవ్ తులసి మొక్కను ప్రదానం చేశారు. దినాజ్ మాట్లాడుతూ ‘నా శిక్షణే నా ప్రపంచం. ప్రతీ ఒక్కరూ నవ్వుతూ ఆనందంగా ఉండాలనేది నా కోరిక’ అని అన్నారు.