ఓపెనర్లు డకౌట్ | team india 375 all out in galle test match | Sakshi
Sakshi News home page

ఓపెనర్లు డకౌట్

Published Thu, Aug 13 2015 5:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

ఓపెనర్లు డకౌట్

ఓపెనర్లు డకౌట్

గాలె: ధావన్, కోహ్లి సెంచరీలకు తోడు సాహా హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 375 పరుగులకు ఆలౌటైంది. లంకపై కోహ్లి సేన 192 పరుగుల ఆధిక్యం సాధించింది. 128/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఆట ప్రారంభించిన టీమిండియా 247 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది.

ధావన్(134), కోహ్లి(103) సెంచరీలు కొట్టారు. సాహా(60) అర్ధసెంచరీ కొట్టాడు. రాహుల్ 7, రోహిత్ శర్మ 9, అశ్విన్ 7, హర్భజన్ 14, అమిత్ మిశ్రా 10, ఆరోన్ 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కౌశల్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్రదీప్ 3 వికెట్లు తీశాడు . ప్రసాద్, మాథ్యూస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 183 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే 2 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లు డకౌట్ అయ్యారు. కరుణ్ రత్నేను అశ్విన్, సిల్వను అమిత్ మిశ్రా క్లీన్ బౌల్డ్ చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 2 వికెట్లు నష్టపోయి 5 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement