టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు చేసిన కోహ్లి | team india loose six wickets in melbourne test | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు చేసిన కోహ్లి

Published Sun, Dec 28 2014 11:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు చేసిన కోహ్లి

టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు చేసిన కోహ్లి

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 434 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే, విరాట్ కోహ్లి సెంచరీలు సాధించారు. 147 పరుగులు చేసిన రహానే నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. తొలి టెస్టు ఆడుతున్న రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు.

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. 11 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆశ్విన్ డకౌటయ్యాడు. మురళీ విజయ్ 68, ధావన్ 28, పూజారా 25 పరుగులు చేసి అవుటయ్యారు. కోహ్లి 152 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. కోహ్లి టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement