
రోహ్‌తక్: జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అభాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నిఖత్ అలవోక విజయం సాధించింది.
మాజీ ప్రపంచ చాంపియన్ సరితా దేవి (60 కేజీలు), ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత సోనియా లాథెర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు), సర్జూబాలా దేవి (48 కేజీలు) కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. మరోవైపు భారత బాక్సింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో మహిళా బాక్సర్ల ప్రతినిధిగా సరితా దేవి ఎన్నికైంది.
Comments
Please login to add a commentAdd a comment