సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్-9 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి సాహితి వర్షిణి (ఏపీ) మరో ఇద్దరితో ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం జరిగిన బాలికల ఎనిమిదో రౌండ్లో సాహితి (7)... సవితశ్రీ (తమిళనాడు; 7)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. మరో పోరులో ప్రతివ్య గుప్తా (ఢిల్లీ; 7)... రిధి పటేల్ (గుజరాత్; 6)ను ఓడించింది. ప్రతివ్య, సవితశ్రీ,, సాహితి ముగ్గు రు ఏడు పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
మిగతా మ్యాచ్‌ల్లో తెలంగాణ అమ్మాయిలు సేవిత విజు (5.5)... ప్రజ్ఞ (తమిళనాడు; 4.5)పై, మనుశ్రీ దేవా (5)... దగారియా సెరా (మధ్యప్రదేశ్; 4)పై గెలుపొందారు. కీర్తి (తెలంగాణ, 5)... టియా సేథియా (పంజాబ్; 5)తో డ్రా చేసుకోగా, మైత్రి (తెలంగాణ, 3.5)... సయూరి నాయక్ (గోవా; 4.5) చేతిలో ఓడింది. బాలుర కేటగిరీలో తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్ (6.5) మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిదో రౌండ్లో ప్రణీత్ (6.5)... దేవ్ షా (మహారాష్ట్ర; 7)తో డ్రా చేసుకోగా, శ్రీకర్ (తెలంగాణ; 5)... సాయి వర్షిత్ (తెలంగాణ; 6) చేతిలో పరాజయం చవిచూశాడు. విశ్వక్సేన్ (తెలంగాణ; 5)... హర్షిత్ (పంజాబ్; 4)పై, ప్రణయ్ వెంకటేశ్ (తెలంగాణ; 5)... సునీల్ వివాన్ (గోవా; 4)పై గెలుపొందారు.