chess champinship
-
చదరంగ కీర్తి.. గుకేశ్ స్ఫూర్తి
సరదాగా స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు చేసే వయస్సులో చెస్‌లో జగజ్జేతగా నిలిచాడు. 18 సంవత్సరాల అతి పిన్న వయస్సులో కలలో కూడా ఊహించని చరిత్రను తిరగరాశాడు. భారత ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తి చేశాడు. కుర్రాడిగా పావులు కదుపుతూ సీనియర్ క్రీడాకారుడిని ఖంగుతినిపించి ప్రపంచ మేధావుల దృష్టిని ఆకర్శించాడు. అతనెవరో కాదు దొమ్మరాజు గుకేశ్. ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా.. చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్ గురించే చర్చ. ఈ నేపథ్యంలో గుకేశ్ ఆటలో ఎత్తుగడలు, విజయం సాధించిన తీరు, తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా చెస్ క్రీడాకారులు, క్రీడాభిమానుల మనోగతం ‘సాక్షి’ పాఠకుల కోసం. ఆరేళ్లకు ఎలో రేటింగ్రెండు సంవత్సరాలుగా చెస్ నేర్చుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన చెస్ టోర్నీలో ర్యాపిడో విభాగంలో దేశవ్యాప్తంగా 1,485వ ఎలో రేటింగ్ వచ్చింది. మా అమ్మనాన్న చాలా సంతోషపడ్డారు. ఈ రోజు పేపర్లలో గుకేశ్ ఫొటోలు చూపించి, అతని గురించి వివరిస్తుంటే.. నేను కూడా ప్రపంచ విజేత కావాలనే ఆకాంక్ష పెరిగింది. రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్లో 1వ తరగతి చదువుతున్న దేవాన్ష్ రెడ్డి, ఆరేళ్ల వయస్సులోనే జాతీయ స్థాయి రేటింగ్ రావడం విశేషం.–దేవాన్ష్ రెడ్డి, రాంనగర్గుకేశ్ ఆటతీరు నచ్చిందిపదేళ్లుగా చెస్‌లో శిక్షణ పొందుతున్నాను. చాలా మంది గ్రాండ్ మాస్టర్ల ఆటను చూసేవాడిని. విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ టోర్నమెంట్లను చూశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్, గుకేశ్ స్టైల్ కళ్లు తిప్పుకోకుండా చేసింది. ఆయన ఆడిన టోర్నమెంట్ వీడియోలు చూసూ్తనే ఉన్నాను. ఆయన స్ఫూర్తితో ఉన్నతస్థాయి టోర్నమెంట్లలో విజేతగా నిలిచేందుకు శ్రమిస్తా.– బి.విశ్వజిత్సాయి, హనుమకొండనేనే ఆడినట్లుగా టెన్షన్ పడ్డానుప్రపంచ స్థాయి వేదికగా గుకేశ్ ఆడుతుంటే నేనే అక్కడ కూర్చుని ఆడినట్లుగా టెన్షన్ పడ్డాను. ఆటముగిసే వరకు మా స్నేహితులం ప్రతిక్షణం ఆసక్తిగా వీక్షించాం. నాలుగు గంటలకు పైగా సాగిన ఆ ఆటలో గుకేశ్ విజయం సాధించడం నేను ఎన్నటికీ మరిచిపోలేను. గుకేశ్ ఆట తీరు, ఆయన ఆత్మవిశ్వాసం నాకెంతో స్ఫూర్తిని అందించాయి.– సూర్యప్రతాప్కోటి, 8వ తరగతి, వరంగల్అద్భుత విజయంఅతి చిన్న వయస్సులో గుకేశ్ ప్రపంచ విజేతగా నిలవడం అసాధారణ విషయం. మాలాంటి క్రీడాకారులకు స్ఫూర్తిని అందించాడు. విశ్వవిజేతగా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేశ్ సాధించిన విజయం మాటల్లో చెప్పలేని అద్భుతం. గుకేశ్ ఆట తీరును చాలా సార్లు దగ్గరి నుంచి చూశాను. ప్రపంచ రికార్డు సమయంలో ఆడిన ఆట అందుకు భిన్నంగా ఉంది. వేసే ప్రతి అడుగు ప్రత్యర్థిని ఇరుకున పెట్టేలా ఉంది. గుకేశ్ ఆత్మవిశ్వాసం, ఆట తీరు నాలో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలను నింపాయి.– వేల్పుల సరయు, మొండ్రాయి, వరంగల్, అంతర్జాతీయ క్రీడాకారిణి -
ఉజ్బెకిస్తాన్ గడ్డపై తెలంగాణ బిడ్డల సత్తా
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్‌షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విఘ్నేశ్ అద్వైత్ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్‌లో యశ్వి జైన్ కాంస్యం పతకం సొంతం చేసుకుంది. -
Meltwater Champions Tour Finals: అర్జున్ ఖాతాలో తొలి విజయం
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 3–1తో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, రెండో గేమ్‌లో 58 ఎత్తుల్లో నెగ్గాడు. మూడో గేమ్‌ను 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన అర్జున్ చివరిదైన నాలుగో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద టోర్నీలో తొలి ఓటమి చవిచూశాడు. ప్రజ్ఞానంద 1–2తో వెస్లీ సో (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎనిమిది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో, అర్జున్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. -
రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ విజేత ప్రజ్ఞానంద
చెన్నై: ప్రతిష్టాత్మక రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఐస్లాండ్ రాజధాని రెక్యావిక్లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 150 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ఆరు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు 5 వేల యూరోలు (రూ. 4 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 58 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో పెంటేల హరికృష్ణ (2006), అభిజిత్ గుప్తా (2010, 2016), భాస్కరన్ ఆధిబన్ (2018) ఈ ఘనత సాధించారు. చదవండి: IPL 2022: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్ -
టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నీలో రెండో స్థానంలో అర్జున్..
Arjun bests Karthikeyan in 17 moves: టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నీలో తొలి మూడు రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 2 పాయింట్లతో ప్రజ్ఞానంద, విదిత్‌లతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. అర్జున్ తొలి రౌండ్లో 45 ఎత్తుల్లో పర్హామ్ల్ (ఇరాన్)పై, మూడో రౌండ్లో 17 ఎత్తుల్లో కార్తికేయన్ (భారత్)పై నెగ్గి... రెండో రౌండ్లో ప్రజ్ఞానంద (భారత్) చేతిలో ఓడాడు. చదవండి: Deepak Chahar: అక్కా తను ఎక్కడ ఉంది... వీడియో వైరల్.. పాపం దీపక్.. మ్యాచ్ జరుగుతుండగానే! -
ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరితో హరికృష్ణ గేమ్ ‘డ్రా’
షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో చైనాలో బుధవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ప్రపంచ 29వ ర్యాంకర్ హరికృష్ణ 66 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఏడో రౌండ్ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 4.5 పాయింట్లతో అనీశ్ గిరి రెండో స్థానంలో... 3.5 పాయింట్లతో లిరెన్ డింగ్ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు. -
సంయుక్తంగా మూడో స్థానంలో హరికృష్ణ, ఆనంద్
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్లు ముగిశాక భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ 5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హరికృష్ణ ఆడిన తొమ్మిది గేముల్లో మూడింట గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రజ్ఞానంద, సూర్యశేఖర గంగూలీ, లెవాన్ అరోనియన్‌లపై నెగ్గిన హరికృష్ణ... మమెదైరోవ్, సెర్గీ కర్జాకిన్, ఆనంద్, విదిత్‌లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. నకముర, సో వెస్లీలతో జరిగిన గేముల్లో హరికృష్ణకు ఓటమి ఎదురైంది. 6.5 పాయింట్లతో నకముర (అమెరికా) ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... సో వెస్లీ (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నేడు మిగతా తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. -
ఆధిక్యంలో సాహితి వర్షిణి
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్-9 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి సాహితి వర్షిణి (ఏపీ) మరో ఇద్దరితో ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం జరిగిన బాలికల ఎనిమిదో రౌండ్లో సాహితి (7)... సవితశ్రీ (తమిళనాడు; 7)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. మరో పోరులో ప్రతివ్య గుప్తా (ఢిల్లీ; 7)... రిధి పటేల్ (గుజరాత్; 6)ను ఓడించింది. ప్రతివ్య, సవితశ్రీ,, సాహితి ముగ్గు రు ఏడు పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మిగతా మ్యాచ్‌ల్లో తెలంగాణ అమ్మాయిలు సేవిత విజు (5.5)... ప్రజ్ఞ (తమిళనాడు; 4.5)పై, మనుశ్రీ దేవా (5)... దగారియా సెరా (మధ్యప్రదేశ్; 4)పై గెలుపొందారు. కీర్తి (తెలంగాణ, 5)... టియా సేథియా (పంజాబ్; 5)తో డ్రా చేసుకోగా, మైత్రి (తెలంగాణ, 3.5)... సయూరి నాయక్ (గోవా; 4.5) చేతిలో ఓడింది. బాలుర కేటగిరీలో తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్ (6.5) మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిదో రౌండ్లో ప్రణీత్ (6.5)... దేవ్ షా (మహారాష్ట్ర; 7)తో డ్రా చేసుకోగా, శ్రీకర్ (తెలంగాణ; 5)... సాయి వర్షిత్ (తెలంగాణ; 6) చేతిలో పరాజయం చవిచూశాడు. విశ్వక్సేన్ (తెలంగాణ; 5)... హర్షిత్ (పంజాబ్; 4)పై, ప్రణయ్ వెంకటేశ్ (తెలంగాణ; 5)... సునీల్ వివాన్ (గోవా; 4)పై గెలుపొందారు.