R Praggnanandhaa Wins Prestigious Reykjavik Open Chess Tournament - Sakshi
Sakshi News home page

R Praggnanandhaa: రెక్యావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ విజేత ప్రజ్ఞానంద 

Published Thu, Apr 14 2022 8:26 AM | Last Updated on Thu, Apr 14 2022 11:16 AM

R Praggnanandhaa Wins Prestigious Reykjavik Open Chess Tournament - Sakshi

చెన్నై: ప్రతిష్టాత్మక రెక్యావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఐస్‌లాండ్‌ రాజధాని రెక్యావిక్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 150 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ఆరు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు.

చాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు 5 వేల యూరోలు (రూ. 4 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 58 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన నాలుగో భారతీయ చెస్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో పెంటేల హరికృష్ణ (2006), అభిజిత్‌ గుప్తా (2010, 2016), భాస్కరన్‌ ఆధిబన్‌ (2018) ఈ ఘనత సాధించారు.

చదవండి: IPL 2022: ఒకే ఓవర్‌లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement