ట్రోఫీతో మూడోస్థానంలో నిలిచిన తెలంగాణ బాలికలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్–జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. దోమల్‌గూడలోని ప్రభుత్వ వ్యాయామవిద్య కాలేజీలో గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు... రాజస్తాన్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మహారాష్ట్ర జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో మహారాష్ట్ర 6–0 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై గెలిచింది. దీంతో ఏపీ జట్టు రన్నరప్‌తో తృప్తిపడింది. బాలుర విభాగంలో ఛత్తీస్‌గఢ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఛత్తీస్‌గఢ్ 2–0తో రాజస్తాన్‌పై విజయం సాధించింది. పంజాబ్ మూడో స్థానం పొందింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డబ్ల్యూబీఎస్‌సీ అధ్యక్షుడు రికార్డో ఫ్రాకారి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్, ఎంపీ జితేందర్ రెడ్డి, భారత సమాఖ్య కార్యదర్శి మౌర్య, రాష్ట్ర సంఘం కార్యదర్శి శోభన్‌బాబు, కోశాధికారి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Softball Championship, Telangana,సాఫ్ట్ బాల్ చాంపియన్ షిప్, తెలంగాణ