సఫారీపై ఆసీస్ గెలిస్తే అంతేఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న భారత జట్టు టెస్టు ర్యాంకింగ్ కూడా దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ధోని సేన రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే గురువారం నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ గెలుచుకుంటే భారత్ తమ రెండో ర్యాంక్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. 133 పాయింట్లతో సఫారీలు ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు.
భారత్ 117 పాయింట్లతో, ఆసీస్ 111 పాయింట్లతో రెండు... మూడో స్థానంలో ఉన్నాయి. అయితే ఆసీస్‌తో సిరీస్ ఫలితం ఎలా వచ్చినా స్మిత్ సేన ర్యాంక్‌కు ఢోకా లేదు. ఒకవేళ భారత్ తమ రెండో టెస్టులోనూ ఓడితే అక్కడ ఆసీస్ సిరీస్‌ను డ్రా చేసుకున్నా సరిపోతుంది. కానీ ఆసీస్ సిరీస్‌ను కోల్పోతే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి తేడా ఉండదు.
భారత్ రెండో ర్యాంకుకు ఎసరు!
Published Tue, Feb 11 2014 12:52 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement