test ranking
-
ఆసీస్ డబుల్ ధమాకా
దుబాయ్: టీమిండియా ఇప్పుడు గదధారి కాదు. ఇంటా బయటా నిలకడైన విజయాలతో టెస్టుల్లో నాలుగేళ్లుగా ఎదురులేని జట్టుగా కొనసాగిన భారత్ అగ్రస్థానం చేజారింది. కొత్త లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక టాప్–3 జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. కోహ్లి సేన 2016–17 సీజన్ నుంచి చక్కని ప్రదర్శనతో వరుసబెట్టి ఒక్కో సిరీస్ గెలుస్తూ వచ్చింది. దీంతో ‘టాప్’ ర్యాంకును చేరుకోవడంతోపాటు ఇన్నాళ్లూ పదిలపరుచుకుంది. అలా ఒకటో నంబర్ జట్టుగా గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. ఈ తాజా విజయాలకు 100 శాతం పాయింట్లు, గత రెండేళ్లకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. దీంతో ఆసీస్ ముందంజ వేయగా... భారత్ మూడో స్థానానికి పడిపోక తప్పలేదు. అయితే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాత్రం భారతే ముందుంది. టి20ల్లో పాక్ నాలుగో స్థానానికి... మరోవైపు టి20 ర్యాంకింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా ముందంజ వేసింది. 2011లో టి20 ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక ఆస్ట్రేలియా జట్టు (278 పాయింట్లు) తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. గత 27 నెలలుగా ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతున్న పాకిస్తాన్ 260 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ (268 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, భారత్ (266 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ 127 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్ రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉన్నాయి. -
స్మిత్ 1, కోహ్లి 2
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఆ్రస్టేలియా స్టార్ స్టీవ్ స్మిత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో 774 పరుగులతో సత్తా చాటిన స్మిత్ 937 ర్యాంకింగ్ పాయింట్లతో నంబర్‌వన్‌గా ఉన్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (903) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్–10లో భారత్ నుంచి పుజారా నాలుగు, రహానే ఏడో స్థానంలో నిలిచారు. యాషెస్‌కు ముందు 5వ ర్యాంక్‌లో ఉన్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఘోర వైఫల్యం తర్వాత ఏకంగా 19 స్థానాలు కోల్పోయి 24కు పడిపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా యాషెస్‌ను నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్యాట్ కమిన్స్ (908 పాయింట్లు) బౌలర్ల జాబితాలో నంబర్‌వన్‌గానే నిలిచాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ మొదటి, రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నారు. విండీస్‌తో రెండు టెస్టులు ఆడకపోయినా... రవిచంద్రన్ అశ్విన్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. -
భారత్ రెండో ర్యాంకుకు ఎసరు!
సఫారీపై ఆసీస్ గెలిస్తే అంతేఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ దుబాయ్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న భారత జట్టు టెస్టు ర్యాంకింగ్ కూడా దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ధోని సేన రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే గురువారం నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ గెలుచుకుంటే భారత్ తమ రెండో ర్యాంక్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. 133 పాయింట్లతో సఫారీలు ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. భారత్ 117 పాయింట్లతో, ఆసీస్ 111 పాయింట్లతో రెండు... మూడో స్థానంలో ఉన్నాయి. అయితే ఆసీస్‌తో సిరీస్ ఫలితం ఎలా వచ్చినా స్మిత్ సేన ర్యాంక్‌కు ఢోకా లేదు. ఒకవేళ భారత్ తమ రెండో టెస్టులోనూ ఓడితే అక్కడ ఆసీస్ సిరీస్‌ను డ్రా చేసుకున్నా సరిపోతుంది. కానీ ఆసీస్ సిరీస్‌ను కోల్పోతే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి తేడా ఉండదు.