‘ఫిఫా’ ఉత్తమ ప్లేయర్‌గా రొనాల్డో
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): గత ఏడాది అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ ప్రదర్శనతో తాను ప్రాతినిధ్యం వహించిన జట్లకు గొప్ప విజయాలు అందించిన ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు తగిన గుర్తింపు లభిం చింది. 2016 సంవత్సరానికిగాను ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఈ పోర్చుగల్ కెప్టెన్‌ను పురుషుల విభాగంలో ‘ఉత్తమ ప్లేయర్’గా ఎంపిక చేసింది. 31 ఏళ్ల రొనాల్డో సారథ్యంలో గతేడాది పోర్చుగల్ జట్టు తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా అవతరించగా... అతని క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్, ప్రపంచ క్లబ్ ఫుట్‌బాల్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. గతేడాది రొనాల్డో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడి 60 గోల్స్ చేశాడు. 20 సార్లు సహచరులు గోల్స్ చేసేందుకు సహకరించాడు. మహిళల విభాగంలో అమెరికా మిడ్‌ఫీల్డర్ కార్లీ లాయిడ్ రెండోసారి ‘ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది. మరోవైపు 2026 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 32 నుంచి 48 జట్లకు పెంచాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది.