హర్షా భోగ్లే
ఇద్దరు పరుగుల మాంత్రికులు అదరగొట్టిన ఐపీఎల్ మ్యాచ్ ఇది. విరాట్ కోహ్లి, డివిలియర్స్ తమదైన శైలిలో చెలరేగిపోయారు. గొప్ప భాగస్వామ్యంతో పరుగుల వరద పారించారు. వారి ఆటతీరు చూస్తుంటే 2010లో డేల్ స్టెయిన్-సచిన్‌ల పోటీ గుర్తుకొచ్చింది. మేటి పోటీ క్రికెట్‌కు ప్రేరణనిచ్చే ఇన్నింగ్స్ ఆడారిద్దరు. ఇక్కడైతే కోహ్లి, ఏబీల జోరు మ్యాచ్‌ను మరింత రంజింపజేసింది. క్రికెట్‌లో చెప్పుకోదగిన భాగస్వామ్యాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. సంప్రదాయ షాట్లతో విరాట్ ఇన్నింగ్స్ సాగితే... డివిలియర్స్‌ది మాటల్లో చెప్పలేని విధ్వంసం. క్రికెట్ పుస్తకంలో ఈ రెండు ఇన్నింగ్స్‌లు దేనికదే సాటి.
ఒక పుస్తకంలో ఒకే అధ్యాయంలో మాత్రం వీటిని చేర్చలేం. వీరి ఆటతీరు ఎలావుందంటే... ఒకే వేదికపై ఇద్దరు విభిన్న సంగీతకారులతో పోల్చితే రవిశంకర్ మెలోడిలా కోహ్లి, జిమి హెండ్రిక్స్ బీట్‌లా డివిలియర్స్ వాయించారనిపిస్తుంది. కలలో మెదిలే జోడీ కళ్లముందే సాక్షాత్కారమైనట్లుగా ఉంది! సచిన్-లారా, గ్రెగ్ చాపెల్-వివ్ రిచర్డ్స్, హెడెన్-సెహ్వాగ్ కలిసి ఆడితే ఎలా ఉంటుందో ఆలా ఉంది కోహ్లి-ఏబీల జోడి. ముఖ్యంగా విరాట్... షార్ట్ కవర్, మిడ్‌ఆఫ్‌లో ఆడిన కవర్ డ్రైవింగ్ అద్భుతమైతే, ఫాస్ట్ బౌలర్లపై డివిలియర్స్ విధ్వంసం మహాద్భుతం. ఇద్దరి మధ్య సమన్వయం ఇన్నింగ్స్ ఆసాంతం చక్కగా కుదిరింది. ఒకర్నొకరు గౌరవించుకుంటూ పిచ్‌పై చేసిన పరుగులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో విజయాన్ని సాధించిపెట్టాయి.
ఆ ఇద్దరిది అద్భుత జోడీ
Published Sun, Apr 24 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement
Advertisement