న్యూఢిల్లీ: బీసీసీఐ నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. దీనికోసం ఈనెల 22న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరగనుంది. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా నియమితులు కావడంతో బోర్డు అధ్యక్షుడి స్థానం ఖాళీ అయ్యింది. ఈ పదవి కోసం ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేది 21. ‘
ముంబైలో ఈనెల 22న మా ఎస్‌జీఎం ఉంది. ఇందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమే ఏకైక అజెండా’ అని గోవా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ ఫడ్కే తెలిపారు. ఠాకూర్‌తోపాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కే పేర్లు కూడా ఈ పదవి కోసం వినిపిస్తున్నాయి. అయితే తాను పదవి కోసం పోటీలో లేనని, అవన్నీ మీడియా కథనాలేనని షిర్కే అన్నారు.
22న బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నిక
Published Sun, May 15 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement