తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, పుణే పోరు
25 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: మరోసారి ప్రొ కబడ్డీ లీగ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి నాలుగో సీజన్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్ తలపడుతున్నాయి. అదే రోజు రెండో సీజన్ విజేత యు ముంబా, జైపూర్ పింక్‌పాంథర్స్ మధ్య కూడా మ్యాచ్ జరుగుతుంది. పట్నా పైరేట్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లీగ్‌ను ఏడాదికి రెండు సార్లు జరిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వదేశీ ఆటగాళ్లతో పాటు 12 దేశాల నుంచి 24 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఆయా జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు.