రెండో రౌండ్‌లో జ్వాల జోడి | the second round of the Jwala Jodi | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో జ్వాల జోడి

Published Wed, Jun 1 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

రెండో రౌండ్‌లో జ్వాల జోడి

రెండో రౌండ్‌లో జ్వాల జోడి

ఇండోనేసియా బ్యాడ్మింటన్

జకర్తా: భారత స్టార్ డబుల్స్ ప్లేయర్ జ్వాల-అశ్విని జోడి.... ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలిరౌండ్‌లో జ్వాల-అశ్విని 21-7, 20-22, 21-10తో ద్విపుజి కుసుమ-రిబ్కా సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచారు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం రెండో గేమ్ చేజార్చుకున్నా.... కీలక సమయంలో బాగా పుంజుకుంది.

పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-13, 21-16తో పీటర్ గాబ్రియెల్-అల్విన్ మోరాడా (ఫిలిప్పిన్స్)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం సమీర్ వర్మకు చుక్కెదురైంది. 11-21, 13-21తో రెండోసీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement