మూడు జోడీలు క్వార్టర్స్‌కు... | New Zealand Open badminton: Jwala-Ashwini sail into quater finals | Sakshi
Sakshi News home page

మూడు జోడీలు క్వార్టర్స్‌కు...

Published Fri, Mar 25 2016 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

మూడు జోడీలు క్వార్టర్స్‌కు...

మూడు జోడీలు క్వార్టర్స్‌కు...

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నుంచి మూడు జోడీలు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ జ్వాల-అశ్విని 10-21, 23-21, 21-15తో మయు మత్సుముటో-వాకన నగహారా (జపాన్)పై నెగ్గారు.

పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-15, 21-16తో రోనెల్ స్టానిస్లావో-పాల్ జెఫర్‌సన్ (ఫిలిప్పీన్స్)పై గెలవగా; ప్రణవ్-అక్షయ్ దివాల్కర్ 14-21, 17-21తో ఏడోసీడ్ చెన్ హుంగ్ లింగ్-చి లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి 21-16, 21-13తో టకుటో ఇనోయ్-నరు షినోయా (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement