భారత్ ‘ఎ’ కెప్టెన్లుగా తివారి, ఉతప్ప | tiwari ,Robin Uthappa india A captains | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ కెప్టెన్లుగా తివారి, ఉతప్ప

Published Thu, Jun 12 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

భారత్ ‘ఎ’ కెప్టెన్లుగా తివారి, ఉతప్ప

భారత్ ‘ఎ’ కెప్టెన్లుగా తివారి, ఉతప్ప

ముంబై: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత ‘ఎ’ జట్లకు రాబిన్ ఉతప్ప, మనోజ్ తివారి కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఆసీస్ పర్యటనలో భారత్ ‘ఎ’ రెండు నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతోపాటు నాలుగు జట్లు పాల్గొనే వన్డే టోర్నీలో ఆడనుంది. ఫస్ట్‌క్లాస్ జట్టుకు తివారి సారథ్యం వహించనుండగా, వన్డే జట్టు పగ్గాల్ని ఉతప్పకు అప్పగించారు. గత రంజీ సీజన్‌తోపాటు ఐపీఎల్-7లో రాణించిన పలువురు ఆటగాళ్లకు ఈ జట్లలో చోటు దక్కింది.
 
 జట్ల వివరాలు: నాలుగు రోజుల మ్యాచ్‌లకు జట్టు: మనోజ్ తివారి (కెప్టెన్), కె.ఎల్.రాహుల్, జీవన్‌జోత్ సింగ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, నమన్ ఓజా, ప్రజ్ఞాన్ ఓజా, ఉమేశ్ యాదవ్, ధావళ్ కులకర్ణి, అనురీత్‌సింగ్, రజత్ పలివాల్, అమిత్ మిశ్రా, సందీప్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, బాబా అపరాజిత్.
 
 వన్డే జట్టు: రాబిన్ ఉతప్ప (కెప్టెన్), ఉన్ముక్త్, మనీశ్ పాండే, అంబటి రాయుడు, మనోజ్ తివారి, కేదార్ జాదవ్, సంజూ శామ్సన్, పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్, ధావళ్ కులకర్ణి, రిషి ధావన్, మోహిత్ శర్మ, కరణ్ శర్మ, రాహుల్ శుక్లా, మనన్ వోహ్రా, జైదేవ్ ఉనద్కట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement