
జైపూర్: అభిషేక్ సింగ్ 11 పాయింట్లతో రాణించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు తొమ్మిదో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–25తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో ఇరు జట్లు చెరో 15 పాయింట్లతో చెలరేగినా... ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన యు ముంబా గెలుపును ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 41–40తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment