
పాకిస్థాన్ గట్టెక్కింది
అఫ్ఘానిస్థాన్‌పై గెలుపు
ఉమర్ అక్మల్ అజేయ సెంచరీ
ఆసియా కప్
ఫతుల్లా: అంతర్జాతీయ మ్యాచ్‌లో క్యాచ్‌లు పట్టడం ఎంత ముఖ్యమో అఫ్ఘానిస్థాన్ జట్టుకు తెలిసొచ్చింది. ఆసియా కప్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓ దశలో పాకిస్థాన్ 117 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే 37వ ఓవర్‌లో ఉమర్ అక్మల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఆఫ్‌సైడ్ స్క్వేర్‌లో సమీయుల్లా మిస్ చేశాడు. ఫలితంగా ఉమర్ అక్మల్ (89 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రెండు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు.
దీంతో ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్లలో షెహజాద్ (74 బంతుల్లో 50; 7 ఫోర్లు) రాణించాడు. ఒంటరిపోరాటం చేసిన అక్మల్ చివర్లో అన్వర్ అలీ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 60, ఉమర్ గుల్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. దౌలత్ జద్రాన్, అషఫ్,్ర సమీయుల్లా తలా రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 47.2 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. నూర్ అలీ జద్రాన్ (63 బంతుల్లో 44; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. హమ్జా స్టానిక్‌జాయ్ (91 బంతుల్లో 40; 3 ఫోర్లు), నౌరోజ్ మంగల్ (57 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మూడో వికెట్‌కు 74 పరుగులు జోడించిన హమ్జా, మంగల్ మూడు పరుగుల వ్యవధిలో అవుట్ కావడం జట్టును దెబ్బతీసింది. తర్వాత పాక్ స్పిన్నర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 37 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు చేజార్చుకున్నారు. హఫీజ్ 3, అజ్మల్, గుల్ చెరో రెండు వికెట్లు తీశారు. గుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పాక్‌కు బోనస్‌తో కలిపి 5 పాయింట్లు లభించాయి.
ఆకట్టుకున్న కూనలు
పాక్‌తో మ్యాచ్‌లో పరుగుల తేడా చూస్తే అఫ్ఘాన్ చిత్తుగా ఓడినట్లే. కానీ... తొలిసారి ఓ పెద్ద టోర్నీలో ఆడిన కూనలు ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో తొలుత అద్భుతంగా రాణించారు. నిజానికి ఉమర్ అక్మల్ క్యాచ్‌గనక పట్టి ఉంటే పాక్ 150లోపే ఆలౌటయ్యేది. అఫ్ఘాన్‌కు చిరస్మరణీయ విజయం దక్కేది. ఇక బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినా... అనుభవలేమి కనిపించింది. ఓవరాల్‌గా అఫ్ఘాన్‌కు ఇది సంతృప్తికర ప్రదర్శనే అనుకోవాలి.
స్కోరు వివరాలు
పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) నూర్ అలీ (బి) హమ్జా 25; షెహజాద్ (బి) సమీయుల్లా 50; హఫీజ్ (సి) నబీ (బి) అషఫ్10; మక్సూద్ (సి) అస్గర్ (బి) సమీయుల్లా 13; మిస్బా రనౌట్ 0; అక్మల్ నాటౌట్ 102; ఆఫ్రిది (బి) దౌలత్ 6; అన్వర్ అలీ (సి) నౌరోజ్ (బి) అషఫ్ ్ర21; ఉమర్ గుల్ (బి) దౌలత్ 15; అజ్మల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 248.
వికెట్ల పతనం: 1-55; 2-78; 3-89; 4-89; 5-108; 6-117; 7-177; 8-217
బౌలింగ్: షాపూర్ 9-1-42-0; దౌలత్ 10-0-73-2; నబీ 8-0-46-0; హమ్జా 8-1-22-1; అషఫ్ ్ర8-1-29-2; సమీయుల్లా 7-0-34-2
అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్: షహజాద్ (సి) అక్మల్ (బి) గుల్ 9; నూర్ అలీ ఎల్బీడబ్ల్యు (బి) అజ్మల్ 44; అస్గర్ (సి) హఫీజ్ (బి) ఆఫ్రిది 40; నౌరోజ్ రనౌట్ 35; నబీ ఎల్బీడబ్ల్యు (బి) గుల్ 15; నజీబుల్లా (బి) హఫీజ్ 1; సమీయుల్లా (బి) హఫీజ్ 14; అషఫ్ రనౌట్ 4; దౌలత్ (బి) అజ్మల్ 0; షాపూర్ (సి) అజ్మల్ (బి) హఫీజ్ 1; హమ్జా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (47.2 ఓవర్లలో ఆలౌట్) 176.
వికెట్ల పతనం: 1-32; 2-65; 3-139; 4-140; 5-151; 6-159; 7-172; 8-172; 9-175; 10-176
బౌలింగ్: గుల్ 9-0-44-2; అన్వర్ 4-0-23-0; జునైద్ 6-1-16-0; ఆఫ్రిది 10-0-31-1; అజ్మల్ 9-1-25-2; హఫీజ్ 9.2-0-29-3