హర్షా బోగ్లే
ఐపీఎల్‌లో నేడు కింగ్స్ ఎలెవన్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్‌లో శక్తివంతమైన నైట్‌రైడర్స్‌ను కట్టడి చేయాలంటే కింగ్స్‌కు తలకుమించిన పనే. సీజన్ ఆరంభం నుంచి విజయాలు సాధించడంలో వెనుకబడిన కింగ్స్... ఇప్పుడు లెస్టర్ సిటీలా తన కలను నిజం చేసుకోవాలి. నేను గతంలో చెప్పినట్లుగా కింగ్స్ సమష్టిగా పోరాడితే పోయేదేమీ లేదు. అద్భుతమైన పోరాటంతోనే గుజరాత్ లయన్స్‌ను ఓడించారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌లో అది చాలా మందికి గుర్తుండకపోయినా... దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చెలరేగాలి. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోనిస్ ఓపెనింగ్ చేయడం వల్ల గురుకీరత్ మన్‌తుది జట్టులోకి రాగలిగాడు.
ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్లలో మిల్లర్ కూడా ఒక్కడు. కానీ ఇప్పటి వరకు ఆ మెరుపులు చూడనేలేదు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై కోల్‌కతా అద్భుతమైన విజయం సాధించింది. ఏ జట్టుకైనా టోర్నీ మధ్యలో ఇలాంటి విజయాలు చాలా స్ఫూర్తినిస్తాయి. కొన్నిసార్లు మెరుగైన ఆరంభం లభించినా...ఆకస్మాత్తుగా స్తబ్దత ఏర్పడుతుంది. ఒకటి, రెండు అపజయాలు ఎదురైనా ఇప్పుడు కేకేఆర్ అద్భుతంగా ఆడుతోంది. జట్టులో సమతుల్యం రావాలంటే కొంత మంది మ్యాచ్ విన్నర్లను ఆర్డర్‌లో కిందకు తీసుకురావాలి.
ఇలా చేసిన ప్రతిసారీ జట్టు గెలుస్తూనే ఉంది. అందుకే వాళ్లు యూసుఫ్ పఠాన్‌కు చాలా విలువ ఇస్తారు. ఇప్పుడు కోల్‌కతా వారం రోజుల పాటు ఒకే వేదికపై నాలుగు హోం మ్యాచ్‌లను ఆడబోతోంది. వీటికి ఉన్న ప్రాధాన్యతను అంత తక్కువగా అంచనా వేయొద్దు.మొదటి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడినప్పుడు ఉన్న సొంత గడ్డ అనుకూలత ఇప్పుడు లేదని కింగ్స్ గుర్తించాలి.
కింగ్స్ పోరాడాలి
Published Wed, May 4 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement