విహారి 135 నాటౌట్‌ | Vihari 135 not out | Sakshi
Sakshi News home page

విహారి 135 నాటౌట్‌

Published Tue, Mar 7 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

విహారి 135 నాటౌట్‌

విహారి 135 నాటౌట్‌

చెన్నై: విజయ్‌ హజారే ట్రోఫీని ఆంధ్ర జట్టు విజయంతో ముగించింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో విహారి (111 బంతుల్లో 135 నాటౌట్‌; 21 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించడంతో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. మొదట రాజస్తాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

మహిపాల్‌ (67), తేజిందర్‌ సింగ్‌ (60) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 3, అయ్యప్ప 2 వికెట్లు తీశారు. ఆంధ్ర 39.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి గెలిచింది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగాల్, గుజరాత్‌ జట్లు నాకౌట్‌ పోరుకు అర్హత పొందగా... ఆంధ్ర జట్టు ఐదో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement