శతకాల రారాజు విరాట్ కోహ్లి మూడో వన్డేలో తన 38వ సెంచరీని అందుకునే క్రమంలో పలు ఘనతలు నమోదు చేశాడు. వన్డేల్లో వరుసగా మూడు శతకాలు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అతడు రికార్డులకెక్కాడు. పరుగుల్లో (ప్రస్తుతం కోహ్లి 10,183) మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (10,150)ని అధిగమించాడు. అంతేకాక, మ్యాచ్‌లో 66 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడి వన్డే కెరీర్ సగటు తొలిసారి 60ని తాకింది. పుణే మ్యాచ్‌తో 214 వన్డేలాడిన కోహ్లి ప్రస్తుతం 59.90 సగటుతో ఉన్నాడు.
►23 ఛేదనలో కోహ్లి శతకాల సంఖ్య. ఇందులో మూడు (2014– నేపియర్‌లో న్యూజిలాండ్‌పై, 2016– కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాపై, తాజాగా పుణెలో విండీస్‌పై) మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ ఓడింది. మొత్తమ్మీద కోహ్లి సెంచరీ చేసిన మ్యాచ్‌ల్లో ఆరుసార్లే టీమిండియా ఓడింది.
► 2 కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో అత్యధిక శతకాలు (3) సాధించిన రికార్డును కోహ్లి రెండుసార్లు (ఈ ఏడాది దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లపై) అందుకున్నాడు. గంగూలీ, డివిలియర్స్ రెండుసార్లు ఇలా చేశారు.
►10 వరుసగా మూడు సెంచరీలు చేసిన పదో క్రికెటర్ కోహ్లి. ఈ జాబితాలో సంగక్కర (శ్రీలంక), జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్, బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), గిబ్స్, డివిలియర్స్, క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్(న్యూజిలాండ్), బెయిర్‌స్టో (ఇంగ్లండ్) ఉన్నారు. సంగక్కర మాత్రం వరుసగా 4 సెంచరీలు చేశాడు.
► 1 స్వదేశంలో కోహ్లి సెంచరీ చేసిన మ్యాచ్‌లో భారత్ ఓడటం ఇదే తొలిసారి.
►1 ఒకే ప్రత్యర్థి (వెస్టిండీస్)పై వరుసగా 4 శతకాలు చేసిన తొలి ఆటగాడు కోహ్లి. ఈ సిరీస్‌కు ముందు 2017 జూలైలో అజే యంగా 111 పరుగులు చేశాడు.
► 1 స్వదేశంలో వరుసగా 4 శతకాలు చేసిన తొలి క్రికెటర్ కోహ్లినే. ఈ మూడింటికి ముందు కివీస్‌పై 2017 అక్టోబర్‌లో కాన్పూర్‌లో సెంచరీ (113) బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment