
కరాచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కోహ్లి దిగ్గజ క్రికెటర్లలో చేరిపోయాడంటూ కితాబిచ్చాడు. ఈ శకంలో క్రికెట్‌ను కోహ్లి శాసిస్తున్నాడంటూ జహీర్ అబ్బాస్ కొనియాడాడు. ఒక్కో తరంలో ఒక్కో ఆటగాడి హవా ఉంటుందని, ఈ తరంలో కోహ్లి తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ముందుకు సాగుతున్నాడన్నాడు. ఎప్పుడో కోహ్లి లెజెండరీ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడన్నాడు. వికెట్‌కు ఇరువైపులా తనదైన శైలితో షాట్లను సంధించే కోహ్లి అమితంగా ఆకట్టుకుంటున్నాడని, ఎడ్జ్‌బాస్టన్‌లో అతని ఆట తనను ఎంతగానో ముగ్ధుడిని చేసిందన్నాడు. సిరీస్ మొత్తం అదే ఆటతీరును ప్రదర్శిస్తాడని జహీర్ అబ్బాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment