క్రికెటర్ల ‘స్వచ్ఛ భారత్’
కోల్కతా: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం భారత క్రికెటర్లు ’స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జట్టు కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానే, కోచ్ కుంబ్లే తదితర ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. వీరంతా ఈడెన్ గార్డెన్స మైదానంలోని ప్రేక్షకుల స్టాండ్లను శుభ్రం చేశారు.