ముంబై: నగరంలో ఓ ప్రముఖ ఏరియాలో రూ. 34 కోట్లతో ఇల్లు కొనేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దాదాపు రెండేళ్ల క్రితమే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఇల్లును కొనేందుకు చేసుకున్న ముందస్తు ఒప్పందాన్ని కోహ్లి తాజాగా రద్దు చేసుకున్నాడు.
ముంబైలోని టోనీ వోర్లి ఏరియాలో ఒక భవన నిర్మాణ సంస్థ తలపెట్టిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్లో 35వ ఫ్లోర్‌లోని 7,171 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని కోహ్లి 2016 జూన్ నెలలో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. అత్యాధునిక హంగులతో కూడిన నిర్మాణం, ప్రత్యేకంగా జాగింగ్, వాకింగ్ చేసుకునేందుకు కారిడార్స్ కూడా ఉన్న సదరు ఇంటికి కోటిన్నర డిపాజిట్ చేయగా, దాదాపు మరో కోటితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.
గతేడాది డిసెంబర్‌లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లాడిన కోహ్లి.. ఇటీవలే ముంబయిలోనే ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాడు. దానికి నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment