విరాట్ కోహ్లి
బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తమ జట్టు పరాజయం పాలవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. భారీ స్కోరు చేసినా ఓడిపోవడంతో కోహ్లి కలత చెందాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. 205 పరుగుల భారీ స్కోరును కాపాడటంలో విఫలమైన తమ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో కనబడిన ‘మిస్టర్ ఫైర్’ తర్వాత నిరుత్సాహానికి గురయ్యాడు. కీలక ఇన్నింగ్స్‌తో చెన్నైకు విజయాన్ని అందించిన అంబటి రాయుడు, ఎంఎస్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు.
‘ఈ రకమైన బౌలింగ్ ఏవిధంగానూ ఆమోదయోగ్యం కాదు. చివరి ఓవర్లలో మరీ ఎక్కువగా పరుగులు ఇవ్వడం నేరం. దీనిపై మేము ప్రధానంగా దృష్టి పెట్టాల్సివుంది. లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి. 200 పరుగుల భారీ స్కోరును కాపాడుకోలేకపోవడం నిజంగా సమస్యే. 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ప్రత్యర్థి జట్టుకు భారీ స్కోరు ఛేదించే అవకాశం ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ సమస్యలను మేము అధిగమించాల్సివుంది. మా బౌలర్లు మళ్లీ పుంజుకుంటారని భావిస్తున్నా. ధోని చాలా బాగా ఆడాడు. ఈ ఐపీఎల్‌లో బంతిని బలంగా బాదుతున్నాడు. మా జట్టుపై అతడు మళ్లీ చెలరేగకూడదని కోరుకుంటున్నా’ని విరాట్ కోహ్లి అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment