ఐపీటీఎల్‌లో విరాట్ కోహ్లి
యూఏఈ రాయల్స్‌లో వాటా
దుబాయ్ : భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చూపు ఇప్పుడు టెన్నిస్‌పై పడింది. ఇప్పటికే తను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజయానిగా కొనసాగుతుండగా... తాజాగా అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లోనూ అడుగుపెట్టాడు. స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను అమితంగా అభిమానించే కోహ్లి ఈ లీగ్‌లో అతడు ఆడే జట్టు యూఏఈ రాయల్స్‌లోనే వాటా తీసుకున్నాడు. ‘నేను టెన్నిస్‌ను చాలా ఆసక్తిగా గమనిస్తుంటాను.
ఇప్పుడు ప్రొఫెషనల్ టెన్నిస్ లీగ్‌లో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. ఫెడరర్‌తో పాటు మా జట్టులో చాలా పెద్ద ఆటగాళ్లున్నారు. ఈ ఫార్మాట్ చాలా బాగుండడంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాను’ అని కోహ్లి తెలిపాడు. డిసెంబర్ 2న జపాన్‌లో ఈ లీగ్ ప్రారంభమవుతుంది.