విశాఖ వన్డేలో కోహ్లి సెంచరీ మిస్ | Virat Kohli Missed 18th oneday Century in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ వన్డేలో కోహ్లి సెంచరీ మిస్

Published Sun, Nov 24 2013 4:43 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖ వన్డేలో కోహ్లి సెంచరీ మిస్ - Sakshi

విశాఖ వన్డేలో కోహ్లి సెంచరీ మిస్

విశాఖపట్టణం: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఆటగాడు విరాట్ కోహ్లి తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకున్నాడు. 100 బంతుల్లో 9 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. రామ్పాల్ బౌలింగ్ భారీ షాట్  యత్నించి అవుటయ్యాడు.

కోహ్లి కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్దనున్న విండీస్ ఆటగాడు హోల్డర్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోవడంతో కోహ్లి నిరాశగా మైదానాన్ని వీడాడు. మ్యాచ్ వీక్షిస్తున్న సహచరులు అవాక్కయ్యారు. వన్డేల్లో 18 సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి అవుటవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement