Century Missed
-
Ind Vs Ban: 6 సార్లు సెంచరీ మిస్! అయితే ఏంటి? నాకు అదే ముఖ్యం
Bangladesh vs India, 2nd Test- Rishabh Pant: 2018.. రాజ్‌కోట్.. వెస్టిండీస్‌పై 92 పరుగులు... అదే ఏడాది.. అదే జట్టుతో హైదరాబాద్‌లో మ్యాచ్‌లో 92 పరుగులు.. 2021.. సిడ్నీ.. ఆస్ట్రేలియాపై 97 పరుగులు.. 2021.. ఇంగ్లండ్‌పై చెన్నైలో 91 పరుగులు.. 2022.. మొహాలీ.. శ్రీలంకపై 97.. తాజాగా బంగ్లాదేశ్‌పై మిర్పూర్లో 93... ఇలా ఆరుసార్లు తృటిలో సెంచరీ చేజార్చకున్నాడు టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్. బంగ్లా పర్యటనలో భాగంగా రెండో టెస్టు రెండో రోజు ఆటలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. టాపార్డర్ విఫలమైన వేళ నేనున్నానంటూ అభయమిచ్చాడు. శ్రేయస్ అయ్యర్(87)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో‘సారీ’ మొత్తంగా 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 రన్స్ చేసిన పంత్.. శతకానికి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇలా తృటిలో సెంచరీ చేజారడం పంత్‌కు ఇది ఆరోసారి. దీంతో రిషభ్ పంత్ సెంచరీ గండం గట్టెక్కలేకపోతున్నాడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సెంచరీ మిస్ అవ్వడంపై పంత్ స్పందిస్తూ.. ‘‘వ్యక్తిగతంగా నా ప్రదర్శన బాగుంది. నేను మెరుగ్గా బ్యాటింగ్ చేశానని నాకు తెలుసు. ఆ మూడు అంకెల సంఖ్య నా దృష్టిలో పెద్ద విషయమేమీ కాదు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు పరిస్థితులకు తగ్గట్లు ఆడటంపైనే ఫోకస్ చేస్తా. ఒకవేళ ఈ క్రమంలో ఏదైనా మైలురాయిని చేరుకుంటే ఆనందమే. అంతేగానీ.. శతకం చేజారిందనే బాధ లేదు. నిజానికి శ్రేయస్ అయ్యర్, నేనూ కలిసి జట్టును కష్టాల్లో పడకుండా కాపాడినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు పంత్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. అయ్యర్ సైతం తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపాడు. చదవండి: IPL 2023 Auction: మిస్టర్ ఐపీఎల్ ‘సూపర్‌స్టార్’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు! Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. -
ఏంటి పంత్.. ఈసారి కూడా అలాగేనా!
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ వన్డే తరహాలో దూకుడుగా ఆడి 88 బంతుల్లో 91 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోసారి సెంచరీ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం గమనార్హం. పంత్ నిష్క్రమణతో టీమిండియా 225 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, అతని ఆటలో నిలకడ లోపించడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సింది పోయి వేగంగా ఆడుతూ వికెట్ సమర్పించుకోవడం పంత్‌కే చెల్లింది. మొన్నటికి మొన్న ఆస్రేలియా సిరీస్‌లోనూ సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అయితే అశ్విన్, హనుమ విహారి పోరాటంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వేగంగా ఆడడం మంచిదే అయినా పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాలన్న ధోరణిలో పంత్ ఆటతీరు లేదనే వాదనలు వినిపించాయి. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఔటైన చూస్తే అదే విషయం స్పష్టమవుతోంది. 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ పుజారా ఇచ్చిన అండతో యథేచ్చగా బ్యాట్ ఝులిపించాడు. అయితే పుజారా అవుటైన తర్వాత పంత్ మరింత జాగ్రత్తగా ఆడాల్సింది. ఎందుకంటే అతను అవుటైన తర్వాత జట్టులో మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేడు.కాస్త ఓపికగా ఉండి ఉంటే సెంచరీ చేయడంతో పాటు టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించే అవకాశాలు ఉండేవి. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సుందర్ 25, అశ్విన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: భారత్‌కు ఫాలోఆన్ గండం తప్పేనా! పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు -
'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది'
బ్రిస్బేన్: ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకున్న క్షణం నుంచి ఇప్పటిదాకా అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఆసీస్ విధించిన 328 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి చేధించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ కడదాకా నిలిచి 89* పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంత్‌కు తోడుగా పుజారా వికెట్లు కోల్పోకుండా అడ్డు గోడగా నిలిచాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్, పుజారాలను ఆకాశానికి ఎత్తడం అందరూ గమనించారు. అయితే ఇక్కడ మరో ఆటగాడు భారత్ నాలుగో టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. 91 పరుగులు చేసి భారత విజయానికి బాటలు పరిచాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న గిల్ ఇన్నింగ్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. గిల్ ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నవేళ.. గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ మాత్రం తన కొడుకు సెంచరీ మిస్ అయినందుకు బాధపడ్డాడు. 'గిల్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా క్రికెట్ చరిత్రలో కొన్ని ఏళ్ల పాటు గర్తుండిపోతుంది. నా కొడుకు ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకం.. కానీ దానిని సెంచరీగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. 91 పరుగుల వరకు వచ్చి కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోవడం కాస్త బాధ కలిగించింది. అయినా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే చిరస్మరణీయ విజయంలో నా కుమారుడు భాగస్వామ్యం కావడం ఆ బాధను మరిచేలా చేసింది. అయితే గిల్ ఔటైన విధానం నన్ను కలవరపరిచింది. అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని టచ్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కానీ ఇది అతనికి మంచి అనుభవం.. రానున్న మ్యాచ్‌ల్లో ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు! గిల్ తండ్రి లఖ్వీందర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారతదేశ సగటు తండ్రి ఆవేదన ఇలాగే ఉంటుంది. ఎంతైనా ఒక కొడుకుకు తండ్రే కదా.. మీరు అలా ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయినా గిల్ 91 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఆనందం ముందు 100 పరుగులు మిస్ కావడం పెద్ద విషయం కాదు' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
విశాఖ వన్డేలో కోహ్లి సెంచరీ మిస్
విశాఖపట్టణం: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఆటగాడు విరాట్ కోహ్లి తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకున్నాడు. 100 బంతుల్లో 9 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. రామ్‌పాల్ బౌలింగ్ భారీ షాట్ యత్నించి అవుటయ్యాడు. కోహ్లి కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్దనున్న విండీస్ ఆటగాడు హోల్డర్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోవడంతో కోహ్లి నిరాశగా మైదానాన్ని వీడాడు. మ్యాచ్ వీక్షిస్తున్న సహచరులు అవాక్కయ్యారు. వన్డేల్లో 18 సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి అవుటవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.