చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ వన్డే తరహాలో దూకుడుగా ఆడి 88 బంతుల్లో 91 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోసారి సెంచరీ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం గమనార్హం. పంత్ నిష్క్రమణతో టీమిండియా 225 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, అతని ఆటలో నిలకడ లోపించడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సింది పోయి వేగంగా ఆడుతూ వికెట్ సమర్పించుకోవడం పంత్‌కే చెల్లింది.
మొన్నటికి మొన్న ఆస్రేలియా సిరీస్‌లోనూ సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అయితే అశ్విన్, హనుమ విహారి పోరాటంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వేగంగా ఆడడం మంచిదే అయినా పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాలన్న ధోరణిలో పంత్ ఆటతీరు లేదనే వాదనలు వినిపించాయి. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఔటైన చూస్తే అదే విషయం స్పష్టమవుతోంది.
73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ పుజారా ఇచ్చిన అండతో యథేచ్చగా బ్యాట్ ఝులిపించాడు. అయితే పుజారా అవుటైన తర్వాత పంత్ మరింత జాగ్రత్తగా ఆడాల్సింది. ఎందుకంటే అతను అవుటైన తర్వాత జట్టులో మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేడు.కాస్త ఓపికగా ఉండి ఉంటే సెంచరీ చేయడంతో పాటు టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించే అవకాశాలు ఉండేవి. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సుందర్ 25, అశ్విన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి:
భారత్‌కు ఫాలోఆన్ గండం తప్పేనా!
పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు
Comments
Please login to add a commentAdd a comment