Ind vs Ban 2nd Test: Reactions for Rishabh Pant's 93 and Missed Ton - Sakshi
Sakshi News home page

Rishabh Pant: 6 సార్లు తృటిలో చేజారిన శతకం! అయితే ఏంటి? నాకు అదే ముఖ్యమంటూ..

Published Sat, Dec 24 2022 10:47 AM | Last Updated on Sat, Dec 24 2022 11:17 AM

Ind Vs Ban 2nd Test: Missed Century Pant Reaction Getting Out On 93 - Sakshi

పంత్‌- అయ్యర్‌ (PC: BCCI)

Bangladesh vs India, 2nd Test- Rishabh Pant: 2018.. రాజ్‌కోట్‌.. వెస్టిండీస్‌పై 92 పరుగులు... అదే ఏడాది.. అదే జట్టుతో హైదరాబాద్‌లో మ్యాచ్‌లో 92 పరుగులు.. 2021.. సిడ్నీ.. ఆస్ట్రేలియాపై 97 పరుగులు.. 2021.. ఇంగ్లండ్‌పై చెన్నైలో 91 పరుగులు.. 2022.. మొహాలీ.. శ్రీలంకపై 97.. తాజాగా బంగ్లాదేశ్‌పై మిర్పూర్‌లో 93... ఇలా ఆరుసార్లు తృటిలో సెంచరీ చేజార్చకున్నాడు టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌.

బంగ్లా పర్యటనలో భాగంగా రెండో టెస్టు రెండో రోజు ఆటలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. టాపార్డర్‌ విఫలమైన వేళ నేనున్నానంటూ అభయమిచ్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌(87)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. 

ఆరో‘సారీ’
మొత్తంగా 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 రన్స్‌ చేసిన పంత్‌.. శతకానికి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇలా తృటిలో సెంచరీ చేజారడం పంత్‌కు ఇది ఆరోసారి. దీంతో రిషభ్‌ పంత్‌ సెంచరీ గండం గట్టెక్కలేకపోతున్నాడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సెంచరీ మిస్‌ అవ్వడంపై పంత్‌ స్పందిస్తూ.. ‘‘వ్యక్తిగతంగా నా ప్రదర్శన బాగుంది. నేను మెరుగ్గా బ్యాటింగ్‌ చేశానని నాకు తెలుసు. ఆ మూడు అంకెల సంఖ్య నా దృష్టిలో పెద్ద విషయమేమీ కాదు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు పరిస్థితులకు తగ్గట్లు ఆడటంపైనే ఫోకస్‌ చేస్తా.

ఒకవేళ ఈ క్రమంలో ఏదైనా మైలురాయిని చేరుకుంటే ఆనందమే. అంతేగానీ.. శతకం చేజారిందనే బాధ లేదు. నిజానికి శ్రేయస్‌ అయ్యర్‌, నేనూ కలిసి జట్టును కష్టాల్లో పడకుండా కాపాడినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు పంత్‌ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. అయ్యర్‌ సైతం తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపాడు.

చదవండి: IPL 2023 Auction: మిస్టర్‌ ఐపీఎల్‌ ‘సూపర్‌స్టార్‌’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు!
Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్‌ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement