
ముంబై: వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడితే అది విరాట్ కోహ్లి ఎంతో లాభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస‍్కర్. ప్రపంచ కప్‌లో జట్టులో ధోనీ ఆడితే మాత్రం.. లాభపడేది భారత్ జట్టేకాదు.. కెప్టెన్ కోహ్లి కూడా గావస్కర్ స్పష్టం చేశాడు.
స్టార్ స్పోర్ట్స్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియాకు ధోని ఆవశ్యకత ఎంత ఉందనే అంశంపై విశ్లేషించిన గావస‍్కర్.. ‘ప్రపంచకప్‌లో ధోని అవసరం విరాట్ కోహ్లికి చాలా ఉంది. ఎందుకంటే.. 50 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి అంశాన్ని కెప్టెన్ చూసుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ ధోని జట్టులో ఉంటే.. ఫీల్డింగ్ మార్పులు, బౌలర్లతో మాట్లాడుతూ సూచనలు చేయడం, వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వికెట్ల వెనుక నుంచే హెచ్చరించడం లాంటి పనులు కెప్టెన్ కోహ్లితో సంబంధం లేకుండా వేగంగా చక్కబెట్టేస్తాడు. ప్రపంచకప్‌లో ఇది కచ్చితంగా విరాట్ కోహ్లికి కలిసొచ్చే అంశం’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: అందుకే అతను ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment