సోషల్ మీడియాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు అకౌంట్లకు సంబంధించి ప్రొఫైల్ పిక్చర్స్ ఖాళీగా కనిపించడం గందరగోళానికి దారితీస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఆర్‌సీబీ అకౌంట్ నుంచి పాత పోస్ట్‌లు అన్ని తొలగించబడ్డాయి. దీంతో అభిమానులే కాకుండా ఆర్‌సీబీ ఆటగాళ్లు, ఇతర క్రికెటర్లు కూడా షాక్‌కు గురవుతున్నారు. బుధవారం ఈ విషయంపై ఆ జట్టు సభ్యుడు యజ్వేంద్ర చహల్ ఆర్‌సీబీని ప్రశ్నించగా.. తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆందోళన వ్యక్తం చేశాడు. ‘సోషల్ మీడియాలో పోస్ట్‌లు మాయమయ్యాయి. దీనిపై కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆర్‌సీబీ మీకు ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి’ అని పేర్కొన్నారు.
అయితే కోహ్లి స్పందన చూస్తుంటే ఆర్‌సీబీలో ఏం జరుగుతుంతో అతనికి సమాచారం లేనట్టుగా తెలుస్తోంది. అందుకే కోహ్లి కూడా అందరిలానే ట్వీట్ చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, కోహ్లి ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆర్‌సీబీ సోషల్ మీడియా అకౌంట్లలలో(ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్) ప్రొఫైల్ పిక్ లోడ్ అవుతున్నట్టు తెలిపేలా ఓ ఫొటోను ఉంచారు. మరోవైపు త్వరలోనే ఆర్‌సీబీ పేరులో మార్పులు చేయబోతున్నారని.. అందుకే సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ ఖాళీగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఒక్కసారైనా టైటిల్‌ను సొంతం చేసుకోకపోవడం వల్లనే ఆ జట్టు పేరు మార్చబోతున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Posts disappear and the captain isn’t informed. 😨 @rcbtweets, let me know if you need any help.
— Virat Kohli (@imVkohli) February 13, 2020
Sit tight. Be right back. pic.twitter.com/kG5ul3wPkF
— Royal Challengers (@RCBTweets) February 13, 2020
చదవండి : ‘ఆర్‌సీబీ’ పేరులో మార్పు?
Comments
Please login to add a commentAdd a comment