విశాఖపట్నం: పరుగుల వరద సృష్టిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతకు చేరువయ‍్యాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేలో విరాట్ కోహ్లి మరో 81 పరుగులు చేస్తే కెరీర్‌లో 10,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 212 వన్డేల్లో 58.69 యావరేజితో 9,919 పరుగులు చేశాడు. ఇందులో 36 శతకాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో 140 పరుగులతో కోహ్లి దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
కాగా, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అయితే కోహ్లి మాత్రం ఇప్పటి వరకు ఆడింది 204 ఇన్నింగ్స్‌లే. దీనిని బట్టి చూస్తే సచిన్ కన్నా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయి కోహ్లి అందుకోనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment