మమ్మల్ని ఇలా వదిలేయండి: కోహ్లి | Virat Kohli Un Happy With Focus On Him And Anushka Sharma | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఇలా వదిలేయండి: కోహ్లి

Published Sat, May 12 2018 3:19 PM | Last Updated on Sat, May 12 2018 7:36 PM

Virat Kohli Un Happy With Focus On Him And Anushka Sharma - Sakshi

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబై: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అందరూ నిరంతరం దృష్టి సారించడం తమకు ఎంతో ఇబ్బందిగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లిలు కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు మా (విరుష్క) జోడీపై మీడియా, ప్రజలు దృష్టిపెట్టడం వరకు ఒకే కానీ, ఇప్పుడు మేం దంపతులమయ్యాక కూడా అదే జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లి జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. అయితే ఏం జరిగినా ఫలితాన్ని తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడంపై కోహ్లి స్పందించాడు. ‘మేం వృత్తిగతంగా, వ్యక్తిగతంగా రాణించాల్సి ఉంటుంది. ఆటతో పాటు నేను కుటుంబం బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తరచుగా మా దంపతుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అసౌకర్యంగా ఉంది. సెలబ్రిటీలు అందరిలాంటి మనుషులే. వారికి కూడా సమస్యలుంటాయి.

మా వ్యక్తిగత విషయాలపై చర్చించకుండా, మాకు స్వేచ్ఛ కల్పించాలి. బిజీ షెడ్యూళ్ల కారణంగా కొన్నిసార్లు ఫ్యామిలీకి సమయం కేటాయించలేం. వీటితో పాటు ఆటగాడిగా ఫిట్‌నెస్ కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. ఖాళీ సమయం దొరికినప్పుడు స్నేహితులతో సమయం గడపాలని, సినిమాలు చూడాలనిపిస్తుందంటూ’ పలు అంశాలు ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement