మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్! | Virender Sehwag give nick name to MS Dhoni | Sakshi
Sakshi News home page

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!

Published Fri, Jun 9 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!

లండన్: క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. ఇక్కడి ఓవల్ మైదానంలో గురువారం శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనా ధన్ ఇన్నింగ్స్ ను మెచ్చుకుంటూ ఓ ముద్దుపేరు పెట్టేశాడు సెహ్వాగ్. కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఈ డాషింగ్ ఓపెనర్.. ధోనీ హాఫ్ సెంచరీ చేశాక అతడి బలాన్ని గురించి చెబుతూ.. అతడు మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. మహేంద్ర 'బాహుబలి' అని కామెంట్ చేశాడు. దీంతో భారత క్రికెట్లోనూ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మేనియా ఏ మేరకు ఉందో స్పష్టమైంది.

ధోనీ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో అతడికిది 62వ హాఫ్ సెంచరీ. అయితే మహీని బాహుబలి అనడంతో ప్రస్తుతం ట్విట్టర్లో దీనిపై కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. ఇకనుంచి అందరూ మహేంద్ర బాహుబలి అని పిలవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందల కోట్ల హృదయాలను గెలుచుకున్న క్రికెట్ బాహుబలి ధోనీ అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. భారత్ మ్యాచ్ ఓడింది కానీ.. సెహ్వాగ్ కామెంటరీ మాత్రం సక్సెస్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement