
విశాఖపట్నం, స్పోర్ట్స్: వన్డే సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డేలో తలపడేందుకు భారత, శ్రీలంక జట్లు గురువారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఇక్కడి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మూడో వన్డే జరగనుంది. శుక్ర, శనివారాల్లో ఉదయం తొమ్మిది గంటలకు శ్రీలంక జట్టు... సాయంత్రం భారత జట్టు ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు.
టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారానే విక్రయిస్తున్నారు. వైఎస్‌ఆర్ స్టేడియంలోనూ ఒక కౌంటర్ ఏర్పాటు చేయగా... స్థానికంగా ఉన్న మాల్స్ ద్వారా మంగళవారం టిక్కెట్లు విక్రయించారు. టిక్కెట్ కనీస ధర రూ. 500 టిక్కెట్లు తొలిరోజే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment