క్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి వృశాలి | vrishali enters into junior badminton tourney quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి వృశాలి

Published Sat, Jul 23 2016 10:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

క్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి వృశాలి

క్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి వృశాలి

ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ
 
సాక్షి, హైదరాబాద్: ఓషాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి వృశాలి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ విభాగంలో వృశాలి 21-19, 20-22, 21-19తో అస్మిత (అస్సాం)పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో సృష్టి- ప్రీతి (తెలంగాణ) జంట 24-22, 21-16తో వైష్ణవి (తెలంగాణ)-ఆర్య మోరె (మహారాష్ట్ర) జోడిపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది.
 
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
 అండర్-19 బాలికల సింగిల్స్
 ప్రిక్వార్టర్ ఫలితాలు
 శిఖా గౌతమ్ (కర్నాటక) 21-13, 21-17తో అమొలికా సింగ్ (ఉత్తరప్రదేశ్)పై, అనురా ప్రభుదేశాయ్ 21-14, 21-13తో ఉన్నతి బిష్త్‌పై, ఆకర్షి కశ్యప్ 21-11, 21-10తో యశస్వినిపై, తనిష్క్ (ఏపీ) 22-20, 13-21, 21-15తో కల్పితా సావంత్‌పై, ప్రాశి జోషి 20-22, 21-18, 21-15తో అపేక్ష నాయక్‌పై, ఐరా శర్మ 21-14, 19-21, 23-21తో వైదేహిపై, కనికా కన్వాల్ 21-19, 21-17త ప్రియాంకపై గెలుపొందారు.

 బాలికల డబుల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు
మహిమ-శిఖా జంట 21-13, 21-19తో ఆదిత్య బినోయ్- నఫీషా సారా జోడిపై, పింకీ-యానియా జంట 21-17, 16-21, 21-16తో సాహితి-ఇషిత జోడిపై, సోనికా-తపస్విని జంట 21-11, 22-20తో ముగ్ధ-వైదేహి జోడిపై, సౌమ్య-మయూరి యాదవ్  జంట 21-17, 23-21తో శ్రుతి మిశ్రా-సమృద్ధి సింగ్ జోడిపై, రియా ముఖర్జీ-ప్రభుదేశాయ్ జంట 21-6, 21-12తో మైత్రేయి ఖత్రి-అనగ జోడిపై, అశ్విని భట్- మిథులా జంట 21-14, 21-18తో డుర్వా గుప్తా-ఖుషి గుప్తా జోడిపై విజయం సాధించారు.
 

అండర్ -17 బాలుర ప్రి క్వార్టర్స్ ఫలితాలు
 కార్తికేయ గుల్షన్ కుమార్ 21-14, 21-11తో శ్యామ్‌ప్రసాద్‌పై, వేదవ్యాస్ సాయి 21-16, 21-13తో అంకిత్‌కుమార్‌పై, అలాప్ మిశ్రా 21-16, 21-18తో అభ్యాస్ సింగ్‌పై, రాహుల్ భరద్వాజ్ 21-15, 21-14తో ఫర్హాజ్ హుస్సేన్‌పై, కిరణ్ జార్జ్ 12-21, 21-11తో ఆకాశ్ యాదవ్‌పై, అమన్ సంజయ్ 21-15, 21-18తో యశ్‌పై, జగదీశ్ 22-20, 16-21, 21-18తో సిద్ధాంత్ సలార్‌పై నెగ్గారు.

బాలికల ప్రిక్వార్టర్స్‌ఫలితాలు
ఆకర్షి కశ్యప్ 21-8, 21-10తో మేఘపై, శీతల్ 21-19, 21-19తో స్మిత్‌తోష్నివాల్‌పై, ఉన్నతి బిష్త్ 10-21, 21-14, 21-16తో అక్షితపై, యశస్విని 21-19, 21-15తో మాలవిక బన్సోద్‌పై, సమీయా ఫరూకి 21-12, 21-9తో అశ్విని భట్‌పై, పుర్వా 21-13, 21-6తో సిమ్రన్ సింగ్‌పై, రితికా 21-8, 21-13తో గాయత్రిపై, రాశి 21-15, 11-21, 21-15తో ప్రాశీ జోషిపై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement