బ్రెజిల్ పోల్ వాల్టర్‌కు కిలో బంగారం
రియో డి జనీరో: స్వదేశంలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన పోల్ వాల్టర్ థియాగో బ్రాజ్ డి సిల్వాకు భారీ జాక్‌పాట్ తగిలింది. దేశానికి ఖ్యాతి తీసుకొచ్చిన డి సిల్వాకు అతని మాజీ క్లబ్ బీఎమ్ అండ్ ఎఫ్‌బీవోవీఈఎస్‌పీఏ కిలో బంగారు కడ్డీని బహుమానంగా అందించింది.
22 ఏళ్ల డి సిల్వా ఒలింపిక్స్‌లో బ్రెజిల్ తరఫున తొలి స్వర్ణం సాధించిన పోల్ వాల్టర్‌గా నిలిచాడు. లండన్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన రెనాడ్ లావిలేనిని అధిగమించి తను విజేతగా నిలిచాడు.