
ఫైనల్ కు చేరిన వావ్రింకా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో వావ్రింకా ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సెమీ ఫైనల్లో భాగంగా శుక్రవారం సోంగాతో జరిగిన పోరులో వావ్రింకా జయభేరి మోగించాడు. వావ్రింకా 6-3, 6-7(1-7), 7-6, 6-4 తేడాతో సోంగాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైయ్యాడు. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన వావ్రింకా.. రెండో గేమ్ ను కోల్పోయాడు. వావ్రింకా అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను సోంగాకు అప్పగించాడు.
అయితే ఆ తరువాత వరుసుగా మూడు, నాలుగు సెట్లలో మాత్రం సోంగాకు వావ్రింకా చుక్కలు చూపించాడు. దీంతో జకోవిచ్-ముర్రే సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో వావ్రింకా ఆమీతుమీకి సిద్దమైయ్యాడు.