Tsonga
-
సోంగాకు బాల్‌గర్ల్ లేఖ!
సిడ్నీ: అవతలి వ్యక్తి కష్టసమయంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని సాయం చేస్తే.. అది సాయం చేసిన మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కష్టాల్లో మనిషిని అక్కున చేర్చుకుని ఓదారిస్తే అది వారి హుందాతనానికి అద్దం పడుతోంది. ఇదే విషయం గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న సమయంలో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా విషయంలో నిజమైంది. టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా అక్కున చేర్చుకుని ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి ఆమెకు వైద్య సేవలు అందించాలంటూ స్పష్టం చేశాడు. ఆ సమయంలో సోంగా జెంటిల్మన్లా వ్యవహరించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదిలా ఉంచితే, ఆనాడు తనపై ఉదారతను చాటుకున్న సోంగాను గుర్తు చేసుకుంటూ ఆ బాలిక..ఈ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా ఓ లేఖను రాసింది. 'నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నేను మీకు గుర్తండకపోవచ్చు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ సందర్బంగా గాయపడిన ఓ బాల్ గార్ల్కు సాయం చేశారు. ఆమెనే నేను. ఆ సమయంలో నాపై చూపిన సానుభూతికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకు ఆ సమయంలో కోర్టు బయటకు వెళ్లేందుకు మనిషి అవసరం. ఆ విషయాన్ని మీరు గుర్తించి ఆ సాయం చేసినందుకు మిమ్ముల్ని, మీలోని వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు మీరు అడిగిన వెంటనే సాయం చేయలేకపోయాను. వైరల్ ఫీవర్ కారణంగా ఆ రోజు నా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు బంతి అడిగిన విషయాన్నిగుర్తించలేకపోయాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ సమయంలో కళ్లు తిరుగుతుండటంతో ఏమీ కన్పించలేదు. నా విధుల్ని సరిగా నిర్వహించలేనందుకు నన్ను క్షమించండి. ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' బాల్ గర్ల్ గిలియాన లేఖలో పేర్కొంది. ఆ లేఖ చదివిని సోంగా ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆ బాల్ గర్ల్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. Thank you very much for your letter Giuliana !!! 👌🏾✨💙 #Remember #AustOpen2016 pic.twitter.com/0dBNXGUFxP — Jo-Wilfried Tsonga (@tsonga7) 22 January 2017 -
బాల్ గర్ల్ పట్ల సోంగా ఉదారత!
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. ఈ తరహా సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బుధవారం ఓమెర్ జాసికాతో మూడో సెట్ సందర్భంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి వేశాడు. దీంతో సోషల్ మీడియాలో సోంగాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను నిజంగా ఒక జెంటిల్మన్ వ్యవహరించాడని టెన్నిస్ అభిమానులు కొనియాడారు. దీనిపై సోంగా స్పందిస్తూ.. ఆ అమ్మాయికి తాను చేసిన సాయం ఏమీ లేదంటూ తన ఉన్నతిని చాటుకున్నాడు. కేవలం స్టేడియం బయటకు పంపడం వరకూ మాత్రమే ఆమెకు సాయ పడ్డాడని తెలిపాడు. -
టైటిల్ దిశగా డిఫెండింగ్ చాంపియన్
న్యూయార్క్ : క్రొయేషియా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ మారిన్ సిలిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టైటిల్ దిశగా అడుగులేస్తున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో నెగ్గి సెమీఫైనల్స్‌లో ప్రవేశించాడు. ఫ్రాన్స్‌కు చెందిన సోంగాను 6-4, 6-4, 3-6, 6-7(3/7), 6-4 తేడాతో మట్టికరిపించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఐదు సెట్ల పాటు జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ సిలిచ్ విజయాన్ని సాధించాడు. సోంగాతో జరిగిన గత ఆరు మ్యాచుల్లో సిలిచ్ కి ఇది ఐదో విజయం కావడం గమనార్హం. నాలుగు గంటల పాటు జరిగిన సుదీర్ఘపోరులో 29 ఎస్‌లు, 63 విన్నర్లను సిలిచ్ సాధించాడు. సెమీస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ ప్లేయర్ లోపేజ్లలో ఒకరితో తలపడతాడు. 2011లోనూ యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన విషయం విదితమే. -
ఫైనల్ కు చేరిన వావ్రింకా
-
ఫైనల్ కు చేరిన వావ్రింకా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో వావ్రింకా ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సెమీ ఫైనల్లో భాగంగా శుక్రవారం సోంగాతో జరిగిన పోరులో వావ్రింకా జయభేరి మోగించాడు. వావ్రింకా 6-3, 6-7(1-7), 7-6, 6-4 తేడాతో సోంగాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైయ్యాడు. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన వావ్రింకా.. రెండో గేమ్ ను కోల్పోయాడు. వావ్రింకా అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను సోంగాకు అప్పగించాడు. అయితే ఆ తరువాత వరుసుగా మూడు, నాలుగు సెట్లలో మాత్రం సోంగాకు వావ్రింకా చుక్కలు చూపించాడు. దీంతో జకోవిచ్-ముర్రే సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో వావ్రింకా ఆమీతుమీకి సిద్దమైయ్యాడు.