టైటిల్ దిశగా డిఫెండింగ్ చాంపియన్
న్యూయార్క్ : క్రొయేషియా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ మారిన్ సిలిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టైటిల్ దిశగా అడుగులేస్తున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్లో నెగ్గి సెమీఫైనల్స్లో ప్రవేశించాడు. ఫ్రాన్స్కు చెందిన సోంగాను 6-4, 6-4, 3-6, 6-7(3/7), 6-4 తేడాతో మట్టికరిపించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో ఐదు సెట్ల పాటు జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ సిలిచ్ విజయాన్ని సాధించాడు.
సోంగాతో జరిగిన గత ఆరు మ్యాచుల్లో సిలిచ్ కి ఇది ఐదో విజయం కావడం గమనార్హం. నాలుగు గంటల పాటు జరిగిన సుదీర్ఘపోరులో 29 ఎస్లు, 63 విన్నర్లను సిలిచ్ సాధించాడు. సెమీస్లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ ప్లేయర్ లోపేజ్లలో ఒకరితో తలపడతాడు. 2011లోనూ యూఎస్ ఓపెన్ క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టిన విషయం విదితమే.