గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై ఫాలోఆన్‌లో పడింది. దీంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (20 బ్యా టింగ్), బిషూ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కరీబియన్ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు 66/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విండీస్ జట్టు లంక స్పిన్నర్ రంగన హెరాత్ (6/68) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. డారెన్ బ్రేవో (50) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ (11) తొందరగా అవుట్‌కాగా, బ్రేవో నిలకడగా ఆడాడు. బ్లాక్‌వుడ్ (11)తో కలిసి నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే లంక బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు.
విండీస్ ఫాలోఆన్
Published Sat, Oct 17 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement
Advertisement